నాడు-నేడుతో ప్రభుత్వ పాఠశాలలు మరింత అభివృద్ధి

* ఐటీడీఏ ఇంఛార్జ్ పీవో ప్రవీణ్ ఆదిత్య

UPDATED 9th JULY 2020 THURSDAY 6:00 PM 

అడ్డతీగల (రెడ్ బీ న్యూస్): ప్రభుత్వ పాఠశాలలను మరింత అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో చేపట్టిన మనబడి నాడు-నేడు కార్యక్రమాలు ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే దిశగా సమన్వయంతో అభివృద్ధి పనులు పూర్తి చేయాలని కార్యనిర్వాహక ఇంజినీర్లు, ఉపాధ్యాయులను ఐటీడీఏ ఇంఛార్జ్ పీవో ప్రవీణ్ ఆదిత్య ఆదేశించారు. మండల పరిధిలోని వీరవరం జియుపి పాఠశాలలో చేపట్టిన మనబడి నాడు-నేడు పనులను ఆయన గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఇప్పటికే ఉన్న మరుగుదొడ్లకు రిపేర్లు చేయించకుండా కొత్త వాటిని ఎందుకు ప్రతిపాదించారని ప్రధానోపాధ్యాయులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సిసి రోడ్లు, స్థలాల లెవెలింగ్ పనులు, ఆట స్థలం అభివృద్ధి, మొక్కల పెంపకంపైనా దృష్టి సారించాలని, ఈనెలాఖరు నాటికి అన్ని రకాల పనులు పూర్తి చేసి పాఠశాలలు పున: ప్రారంభం నాటికి  సిద్ధం చేయాలని అన్నారు. అనంతరం డి. రామవరం గ్రామంలో వాటర్ షెడ్ పథకంలో భాగంగా నిర్మించిన చెక్ డామ్ ను ఆయన పరిశీలించారు. పీవో  సందర్శనలో భాగంగా వాటర్ షెడ్ సిబ్బంది హాజరు కాకపోవడంతో ఆయన అసహనం వ్యక్తం చేసారు. అనంతరం అడ్డతీగల ఎపిఆర్ఎస్ పాఠశాలలో చేపట్టిన నాడు-నేడు పనులు నత్తనడకన నిర్వహిస్తున్నారని గమనించి వారం రోజులలో పురోగతి కనిపించాలని పంచాయితీరాజ్ ఎఈఈ రవితేజను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యా శాఖాధికారులు, ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us