ఆదిత్యలో ఘనంగా యువజనోత్సవాలు

UPDATED 10th JANUARY 2020 FRIDAY 5:00 PM

గండేపల్లి(రెడ్ బీ న్యూస్): గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య విద్యా సంస్థల ప్రాంగణంలో గల ఇంజనీరింగ్ కళాశాలల్లో యువజనోత్సవాలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈనెల 12న స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని ఆదిత్య సాంస్కృతిక విభాగం "అభినయ" ఆధ్వర్యంలో ఆదిత్య ఇంజనీరింగ్ విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించారు. రంగోలి, నృత్య ప్రదర్శనలు, పాటల పోటీలు, సంగీత, వాయిద్య పోటీలు నిర్వహించి విజేతలను ప్రకటించారు. ఆదిత్య క్యాంపస్ డైరెక్టర్, ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా విజేతలకు అవార్డులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో డీన్ (అకడమిక్స్) డాక్టర్ ఎస్. రమాశ్రీ, సాంస్కృతిక విభాగం కోఆర్డినేటర్ డాక్టర్ ఎం.ఎస్.సి. సోపియా, ఇసిఇ విభాగాధిపతి జి. శ్రీదేవి, అసోసియేట్ ప్రొఫెసర్ సుధారాణి, సీనియర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పి. బుజ్జిబాబు, గ్రంధాలయ అధికారి కె. అశోక్ కుమార్, తదితరులు పాల్గొన్నారు. 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us