ఆత్మవిశ్వాసం పెంపొందించేలా ఉపాధ్యాయులు పనిచేయాలి

UPDATED 1st AUGUST 2019 THURSDAY 9:00 PM

సామర్లకోట: విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేలా ఉపాధ్యాయులు పనిచేయాలని సెట్రాజ్ సిఈవో, సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ పి. విజయభాస్కర్ పేర్కొన్నారు. స్థానిక ఎన్టీఆర్ క్రీడా వికాస కేంద్రాన్ని గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా కబడ్డీ కోచ్ గత వారం రోజులు నుంచి అందుబాటులో లేకపోవడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సంస్థ పనితీరుపై కెవికె చీఫ్ కోచ్ సాయిప్రసాద్ ద్వారా వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడాభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తుందని, దానికి అనుగుణంగా సిబ్బంది అంకితభావంతో పని చేయాలని, విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని, సమస్యలేమైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని అన్నారు. విధులకు హాజరుకాని వారికి మెమో జారీచేసి సంజాయిషీ కోరనున్నట్లు తెలిపారు. అనంతరం అయోధ్య రామపురంలో గల మున్సిపల్ ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థులకు అందుతున్న సదుపాయాలపై ఆరా తీశారు. మార్కులు కన్నా విలువలు నేర్పే విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పిడి వెంట ప్లానింగ్ కోఆర్డినేటర్ సలాది సుధాకర్, ఎంఈవో వైవి శివరామకృష్ణయ్య, ప్రధానోపాధ్యాయులు తోటకూర సాయి రామకృష్ణ, తదితరులు ఉన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us