ఘనంగా కొండా లక్ష్మయ్య వర్ధంతి

UPDATED 20 th OCTOBER 2017 FRIDAY 5:00 PM

గుంటూరు: రాష్ట్ర భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షుడు, గుంటూరు నగరపాలక సంస్థ కాంట్రాక్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు కొండా లక్ష్మయ్య  ప్రథమ వర్దంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పవన చేయూత ఫౌండేషన్, ది గుంటూరు మున్సిపల్ కాంట్రాక్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, రాష్ట్ర భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం లక్ష్మయ్య మనవడు (పవన చేయూత ఫౌండేషన్ ప్రతినిధి) కొండా సాయి మాట్లాడుతూ లక్ష్మయ్య వర్ధంతి సందర్భంగా ఆయన చేసిన సేవలను కొనియాడారు. కార్మికుల సమస్యల పరిష్కారంలో ఆయన చేసిన కృషి ఆమోఘమన్నారు. ఆయన వర్దంతిని పురస్కరించుకుని గుంటూరు జిల్లాలో పలు స్వచ్చంధ సేవా సంస్థలలో వృద్ధులకు, వికలాంగులకు, విద్యార్థులకు భారీ అన్నదాన కార్యక్రమం, పండ్లు,బిస్కెట్లు, చాక్లెట్లు, మిఠాయిలు పంపిణీ చేశారు. అదేవిధంగా ఎన్నో దశాబ్దాలుగా లక్ష్మయ్య  కాంట్రాక్టర్లు, బేల్దారి మేస్త్రీలకు, ప్రజలకు, భవన నిర్మాణ కార్మికులకు ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. కాంట్రాక్టర్స్ అధ్యక్షుడు కొండా రమేష్ మాట్లాడుతూ లక్ష్మయ్య కాంట్రాక్టర్లుకు సంబందించిన అభివృద్ధి పనులకు ఎన్నో సమస్యలకు ఎంతో కృషి చేయటం చాలా సంతోషకరమైన దన్నారు. ఈకార్యక్రమంలో కాంట్రాక్టర్లు డి.వెంకటేశ్వరరావు, శ్రీధర్,గంగాధర్, బాషా, తాపీ మేస్త్రీలు సంఘం అధ్యక్షుడు జి.నరసయ్య,  కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
 
 
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us