ఆదిత్యలో మే 28, 29 తేదీల్లో మెగా జాబ్ మేళా

UPDATED 25th MAY 2018 FRIDAY 5:00 PM

గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ క్యాంపస్ లో ఈ నెల 28, 29వ తేదీలలో రాష్ట్ర సమాచార, సాంకేతిక సంస్థ (ఎపిఐటిఎ) వారి ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఆదిత్య విద్యాసంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి తెలిపారు. ఈ జాబ్ మేళాలో 30 కంపెనీలకు పైగా పాల్గొని ఇంటర్వ్యూలు ఆధారంగా ఉద్యోగాలు కల్పిస్తారని,10వ తరగతి నుంచి పి.జి వరకు విద్యార్హతలు గల నిరుద్యోగ యువత పాల్గోవచ్చని  అన్నారు. సాంకేతిక విద్యార్హతలు కలిగిన అభ్యర్థులతో పాటు సాధారణ విద్యార్హతలు గల అభ్యర్థులు సైతం ఈ ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చని, ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ వివరాలను www.apita.ap.gov.in వెబ్ సైట్ లో రిజిస్టర్ చేసుకోవాలని సతీష్ రెడ్డి అన్నారు.  

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us