UPDATED 4th DECEMBER 2018 TUESDAY 9:00 PM
సామర్లకోట: విద్యాశాఖ కమీషనర్ బి. ఉదయలక్ష్మి పిలుపు మేరకు స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ విద్య స్వర్ణోత్సవాలు (1968 -2018) మంగళవారం ప్రారంభమైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఐ. శారద తెలిపారు. ఈ సందర్భంగా గ్రంథాలయ అధికారిణి శాంతిశ్రీ ఆధ్వర్యంలో విద్యార్థినీ, విద్యార్థులకు క్విజ్ ప్రోగ్రామ్స్ నిర్వహించారు. స్వర్ణోత్సవాల్లో భాగంగా ఈ నెల ఆరవ తేదీన ఆధ్వర్యంలో పాత నాణాలు, కరెన్సీ నోట్ల ప్రదర్శన నిర్వహించనున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.







