UPDATED 23rd FEBRUARY 2018 FRIDAY 7:30 PM
గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల తృతీయ సంవత్సరం కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విద్యార్థిని సి.హెచ్. అలేఖ్యా దీప్తి ఈ నెల 17,18 తేదీల్లో కాకినాడ జె.ఎన్.టి.యులో నిర్వహించిన జాతీయ స్థాయి టెక్నికల్ సింపోజియంలో విశేష ప్రతిభ కనబరిచి ప్రథమ బహుమతి గెలుపొందినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంప్యూటర్ సైన్స్ విభాగంలో నిర్వహించిన బగ్ మైనింగ్ అనే అంశంలో ఈ బహుమతి సాధించినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థినిని వైస్ ప్రిన్సిపాల్స్ ప్రొఫెసర్ వి.శ్రీనివాసరావు, ప్రొఫెసర్ ఎ. వానతి, తదితరులు అభినందించారు.







