* సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు దువ్వా శేషుబాబ్జీ
సామర్లకోట(రెడ్ బీ న్యూస్): ప్రపంచ గతిని మార్చిన పుస్తకమే కమ్యూనిస్టు ప్రణాళికని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు దువ్వా శేషుబాబ్జీ పేర్కొన్నారు. స్థానిక మెహర్ కాంప్లెక్స్ లోని భగత్ సింగ్ విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం జరిగిన కమ్యూనిస్టు ప్రణాళిక పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కమ్యూనిస్టు ప్రణాళిక 1848 ఫిబ్రవరి 21న విడుదలై నేటికి 172 సంవత్సరాలు పూర్తయిందని అన్నారు. ప్రపంచ అన్ని భాషల్లో ఈ పుస్తకం విడుదలైందని, ప్రపంచమంతా వర్గ పోరాటాల భ్రాంతే అని ఈ పుస్తకం తెలియజేస్తుందని అన్నారు. పోరాటాల ద్వారా సోషలిస్టు ప్రపంచం వస్తుందని ఆయన తెలిపారు. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కరణం ప్రసాదరావు మాట్లాడుతూ ఈ ప్రణాళిక ప్రపంచంలో అనేక దేశాల విప్లవాలకు నాంది పలికిందని ఐదు కమ్యూనిస్టు దేశాలు (చైనా, క్యూబా, వియత్నాం, ఉత్తర కొరియా, లోహన్)లో 150 కోట్ల మంది ప్రజానీకం కమ్యూనిస్టు పార్టీ పాలనలో ఉన్నారని, ఈ పుస్తకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు బాలం శ్రీనివాస్, తుంపాల శ్రీనివాస్, కరణం గోవిందరాజు, బర్ల గోపాల్, పెనుపోతుల సత్తిబాబు, ప్రకృతి ఈశ్వరరావు, కరణం సత్యనారాయణ, బాలం సత్తిబాబు, పవన్, శ్రీను, కరణం ఏడుకొండలు, ఖయూమ్, తదితరులు పాల్గొన్నారు.







