UPDATED 2nd NOVEMBER 2018 FRIDAY 9:00 PM
సామర్లకోట: మండల పరిధిలోని హుస్సేన్ పురం గ్రామంలోని పంచాయతీ కార్యాలయ ఆవరణలో గ్రామదర్శిని కార్యక్రమంలో భాగంగా శుక్రవారం గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా మండల ప్రత్యేక అధికారి రాజశేఖర్ మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగ చేసుకోవాలని అన్నారు. తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు చల్లా బుజ్జి మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరువయ్యేలా ప్రభుత్వం గ్రామదర్శిని కార్యక్రమం నిర్వహిస్తుందని, ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తేవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రత్యేక అధికారి డాక్టర్ నీరజ, పంచాయతీ కార్యదర్శి జి. రమణ, ఆరోగ్య సిబ్బంది ఎం. సూర్యకుమారి, వీఆర్వో ఖాదర్ వల్లి, అంగన్వాడీ కార్యకర్తలు ఎర్రా వెంకటలక్ష్మి, మారిశెట్టి దుర్గాభవాని, విమల, ఫీల్డ్ అసిస్టెంట్ వెంకటలక్ష్మి, యానిమేటర్స్, సాధికార మిత్రలు, తదితరులు పాల్గొన్నారు.







