* పెద్దాపురం ఆర్డీవో ఎస్.మల్లిబాబు
* రాజ్యాంగ నిర్మాతకు ఘన నివాళి
UPDATED 6th DECEMBER 2019 FRIDAY 6:00 PM
పెద్దాపురం(రెడ్ బీ న్యూస్): భారతదేశానికి అంబేద్కర్ చేసిన సేవలు మరువలేనివని పెద్దాపురం ఆర్డీవో ఎస్. మల్లిబాబు కొనియాడారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 63వ వర్ధంతిని పురస్కరించుకుని స్థానిక ఆర్డీవో కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి శుక్రవారం పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మల్లిబాబు మాట్లాడుతూ దేశంలో సమసమాజ నిర్మాణం కోసం కృషి చేసిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశ ప్రజలందరికీ ఆదర్శంగా నిలిచారని, నేటి సమాజం ఆయన జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు. అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో కార్యాలయం ఏవో పి. చిన్నారావు, డిప్యూటీ తహసీల్దార్లు భానుకుమార్, రాంకుమార్, కార్యాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.







