UPDATED 19th AUGUST 2018 SUNDAY 9:00 PM
సామర్లకోట: స్థానిక మఠం సెంటర్ లో నూతనంగా ప్రారంభిస్తున్న మధు ఫోటోగ్రఫీ స్టూడియోను మాజీ ఎంఎల్సీ బొడ్డు భాస్కరరామారావు ముఖ్య అతిధిగా హాజరై ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం రోజున ఈ స్టూడియోను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బొడ్డు అనంత వెంకటరమణ చౌదరి, పాగా సురేష్ కుమార్, పుట్టా సురేష్, మాజీ మున్సిపల్ చైర్మన్ గోలి వెంకట అప్పారావు చౌదరి (దొరబాబు), యార్లగడ్డ జగదీష్, గుణ్ణం రాజబ్బాయి, కె. రాఘవేందర్రావు(బుజ్జి), వై. ఉమాశంకర్, తదితరులు పాల్గొన్నారు.







