UPDATED 7th MAY 2019 TUESDAY 8:00 PM
పెద్దాపురం: స్థానిక రామారావుపేటలో గల శ్రీ ప్రకాష్ సినర్జీ పాఠశాలలో వివిధ క్రీడలు, క్రియేటివ్ స్కిల్స్ విభాగాల్లో నిర్వహిస్తున్న వేసవి శిక్షణా తరగతుల్లో భాగంగా మంగళవారం నిర్వహించిన ఏరోమోడలింగ్ విన్యాసాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ ఏరోమోడలింగ్ విభాగంలో విమానాలు, రాకెట్లు ఏవిధంగా తయారుచేస్తారు, అవి ఏ సూత్రం ఆధారంగా ఎగురుతాయి అనే విషయాలు విద్యార్థులు తెలుసు కున్నారు. ప్రొపెల్లర్ ప్లేయిన్, ఆర్నితాఫ్లర్, వాటర్ పవర్ రాకెట్ విద్యార్థులు తయారు చేసి ఎగురవేశారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ సిహెచ్ విజయప్రకాష్ మాట్లాడుతూ తమ పాఠశాలకు చెందిన విద్యార్థులు ఏరోమోడలింగ్, రోబోటిక్స్, తదితర అంశాలకు సంబంధించిన విషయాలు తెలుసుకోవడం ద్వారా వారిలో వైజ్ఞానిక, సృజనాత్మక ఆలోచనలు పెరిగి, భావిభారత వైజ్ఞానికవేత్తలుగా ఎదిగేందుకు దోహదపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సీవోవో లెఫ్టినెంట్ కమాండర్ కెఎస్ రావు, ఉపాధ్యాయులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.







