* రహదారి పునర్నిర్మాణాన్ని పరిశీలించిన గైట్ విద్యార్థులు
UPDATED 20th SEPTEMBER 2018 THURSDAY 5:30 PM
రాజానగరం: గోదావరి ఇనిస్టిట్యూట్ అఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ( గైట్) అటానమస్ కళాశాల సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులు రహదారి పునర్నిర్మాణ పనులలో ఉపయోగించే అధునాతన పరికరాలు, అమలు చేసే నూతన పద్ధతులు తెలుసుకునేందుకు జాతీయ రహదారి పనులను గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ మేనేజర్ బి. మల్లిఖార్జునరెడ్డి, సైట్ ఇంజనీర్ సౌరబ్ జున్ జున్ వాలే విద్యార్థులకు వివరించారు. ఈ విధమైన క్షేత్ర సందర్శన వల్ల విద్యార్థులకు ఆచరణాత్మక పరిజ్ఞానం అలవడుతుందని సివిల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ డి. వెంకటేశ్వర్లు తెలిపారు. రహదారుల్లోని రకాలు, వాటి నిర్మాణంలో మెళుకువలు గురించి విద్యార్థులకు వివరించారు. ప్రాజెక్ట్ మేనేజర్ బి. మల్లిఖార్జునరెడ్డి, సైట్ ఇంజనీర్ సౌరబ్ జున్ జున్ వాలే మాట్లాడుతూ నూతన పరికరాలతో నిత్యం కొన్ని కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణం సునాయాసంగా, నాణ్యతలో ఎటువంటి రాజీ లేకుండా తక్కువ వ్యయంతో నిర్మించవచ్చని విద్యార్థులకు వివరించారు. రహదారుల నాణ్యత పరిశీలన, అందుకు నిర్వహించే పరీక్షా పద్దతులను కూడా తెలిపారు. ఈ కార్యక్రమంలో సివిల్ ఇంజనీరింగ్ అధ్యాపక బృందం కూడా పాల్గొని విద్యార్థులకు తగిన సూచనలు, సలహాలు రహదారుల నిర్మాణంలో పాటించవలసిన జాగ్రత్తలు వివరించారు.







