UPDATED 23rd AUGUST 2018 THURSDAY 9:00 PM
సామర్లకోట: ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం పంతులు జయంతిని పురస్కరించుకుని స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి తహసీల్దార్ ఎల్. వెంకటేశ్వరావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ దేశభక్తి, నిస్వార్థసేవల్లో టంగుటూరు ప్రకాశం పంతులే ఆదర్శనీయుడన్నారు. ఆయన చూపిన మార్గంలో పయనిస్తూ సమాజాభ్యున్నతికి కృషి చేయాలని యువతరానికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.







