TS News: 4 జిల్లాల్లోని 4 మండలాలకు దళితబంధు నిధులు విడుదల

హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 21 డిసెంబర్ 2021‌: ఎంపిక చేసిన నాలుగు మండలాల్లో దళితబంధు పథకం అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి, నాగర్ కర్నూల్ జిల్లా చారగొండ, కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలాలకు రూ.50 కోట్లు చొప్పున.. ఖమ్మం జిల్లా చింతకాని మండలానికి రూ. 100 కోట్లు విడుదల చేశారు. ఆయా మండలాలకు సంబంధించిన నిధులు సదరు జిల్లాల కలెక్టర్ల ఖాతాల్లో ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ జమ చేసింది. దళితబంధు అమలుపై ఇటీవల కలెక్టర్లతో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఈ నిధులు విడుదల చేశారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us