UPDATED 9th JANUARY 2020 THURSDAY 8:30 PM
పెద్దాపురం(రెడ్ బీ న్యూస్): పెద్దాపురం-సామర్లకోట ఎడిబి రహదారిలో గల రుచీ సోయా ఇండస్ట్రీస్ ను ప్రముఖ ఆయుర్వేదిక్ సంస్థ పతంజలి టేకోవర్ చేసిన నేపథ్యంలో పెద్దాపురం పట్టణానికి వచ్చిన సుప్రసిద్ధ యోగా గురువు బాబా రాందేవ్ పట్టణంలోని మార్ని రాజబ్బాయి పామాయిల్ వ్యవసాయ క్షేత్రాన్ని గురువారం ఆయన పరిశీలించారు. ఈ క్షేత్రంలో సాగు చేస్తున్న వ్యవసాయ విధానాలను రైతులను ఆయన అడిగి తెలుసుకున్నారు. రైతులు పామాయిల్ సాగుపై దృష్టి సారిస్తే మనదేశం ఆర్ధికంగా బలోపేతం అవుతుందని, పామాయిల్ సాగు విస్తీర్ణం తగ్గితే మనం పామాయిలను విదేశాల నుంచి దిగుమతి చేసుకునే పరిస్థితి ఏర్పడి దేశ సంపద ఇతర దేశాలకు తరలిపోతుందని అన్నారు. ఈ సందర్భంగా అధిక విస్తీర్ణంలో పామాయిల్ సాగు చేస్తున్న రైతు రాజబ్బాయి, మార్ని సాయిరాంలను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో శ్రీఫీడ్స్ అధినేత మార్ని చిన్న, రుచి సోయా ఇండస్ట్రీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.







