జోరుగా నామినేషన్ల దాఖలు

UPDATED 9th AUGUST 2017 WEDNESDAY 10:00 PM

కాకినాడ: కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో నామినేషన్ల దాఖలుకు ఈ నెల 10 వ తేదీ  చివరి రోజు కావడంతో అన్ని పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు ముమ్మర ఏర్పాట్లు చేసుకోవడంతో నగరంలో సందడి నెలకొంది. బుధవారం మొత్తం 100 నామినేషన్లు దాఖలయ్యాయి. దీంతో ఇప్పటి వరకు దాఖలైన నామినేషన్ల సంఖ్య 112కు చేరింది.
మధ్యాహ్నం మూడు గంటలు లోగా నామినేషన్లు వేయాలి : కమీషనర్
10 వ తేదీ మధ్యాహ్నం మూడు గంటలలోగా అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేయాలని కమీషనర్ ఆలిం భాషా పేర్కొన్నారు. రాజకీయ పార్టీలన్నీతమ అభ్యర్దులతో కూడిన ధ్రువపత్రాలను గురువారం సాయంత్రంలోగా అందచేయాలని, అభ్యర్థుల వడపోత సమయంలో ఈ జాబితా అందుబాటులో ఉండాల్సి ఉందన్నారు.     
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us