UPDATED 5th JUNE 2019 WEDNESDAY 10:30 PM
కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ గా అద్నాన్ నయీమ్ అస్మి నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం రాత్రి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన ప్రస్తుతం విశాఖ జోన్-2 డీసీపీగా విధులు నిర్వహిస్తున్నారు. జమ్ము-కశ్మీర్ రాష్ట్రానికి చెందిన నయీమ్ 2013లో ఐపీఎస్‌కు ఎంపికైన ఆయన 2015లో గ్రేహౌండ్స్‌లో అసాల్ట్ కమాండర్‌గా విధులు నిర్వహించారు. 2016 జనవరి 3 నుంచి 2018 జనవరి వరకు రంపచోడవరం ఏఎస్పీగా పనిచేశారు. అనంతరం పదోన్నతిపై అడిషనల్ ఎస్పీగా (ఆపరేషన్స్) కడప జిల్లాకు బదిలీ అయ్యారు. ఇంతవరకు ఇక్కడ ఎస్పీగా పనిచేసిన విశాల్ గున్నీ ఆక్టోపస్‌కు బదిలీ అయ్యారు.







