వాలంటీర్లు అంకితభావంతో ప్రజలకు సేవలందించాలి

UPDATED 9th AUGUST 2019 FRIDAY 9:00 PM

సామర్లకోట: వాలంటీర్లు అంకితభావంతో ప్రజలకు సేవలు అందించాలని మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్, సెట్రాజ్ సీఈవో బి. విజయభాస్కర్ అన్నారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో వార్డు వాలంటీర్లు శిక్షణా తరగతులు ముగింపు కార్యక్రమంలో శుక్రవారం ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వాలంటీర్లు ప్రజలతో మమేకమై నీతి, నిజాయితీలతో పనిచేస్తూ తమ ఉద్యోగ భాద్యతలను సక్రమంగా నిర్వహించాలని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పధకాలను ప్రజలకు చేరువ చేసే భాద్యత మీపై ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ ఎం. ఏసుబాబు, డిఈఈ సిహెచ్. రామారావు, ఏఈ ప్రభాకర్, మాస్టర్ ట్రైనర్లు తోటకూర సాయిరామకృష్ణ, యు. సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు. 

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us