UPDATED 3rd DECEMBER 2018 MONDAY 5:00 PM
గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన లైబ్రరీ అసిస్టెంట్ ఎన్.సింహాచలం, జూనియర్ అసిస్టెంట్ పి. సీతారాం జిల్లాస్థాయి యోగా పోటీలలో ప్రతిభ కనబరిచినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆదిరెడ్డి రమేష్ తెలిపారు. కాకినాడ రామారావుపేటలో జిల్లా యోగా క్రీడా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల రెండవ తేదీన నిర్వహించిన జిల్లాస్థాయి యోగా పోటీలలో విశేష ప్రతిభ కనబరిచి వెటరన్ కేటగిరి విభాగంలో లైబ్రరీ అసిస్టెంట్ ఎన్. సింహాచలం ప్రథమ స్థానంలో నిలిచి గోల్డ్ మెడల్, అలాగే ఎల్డర్ కేటగిరి విభాగంలో పి. సీతారాం ద్వితీయస్థానంలో నిలిచి సిల్వర్ మెడల్ సాధించారని తెలిపారు. వివిధ సందర్భాలలో కళాశాల విద్యార్థులకు యోగా విశిష్టతను తెలుపుతూ యోగ తరగతుల ద్వారా శిక్షణ ఇస్తూ సహకరిస్తున్న వీరిని డాక్టర్ రమేష్ అభినందించారు.







