ఆదిత్యలో ఇసిఇ విద్యార్థులకు గెస్ట్ లెక్చర్

UPDATED 3rd JULY 2018 TUESDAY 7:00 PM

గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాల నాల్గవ సంవత్సరం ఇసిఇ ఇంజనీరింగ్ విద్యార్థులకు రీసెంట్ ట్రెండ్ ఇన్ సిగ్నల్ అండ్ ఇమేజ్ ప్రాసెసింగ్ అనే అంశంపై మంగళవారం గెస్ట్ లెక్చర్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన విజయనగరం జె.ఎన్.టి.యు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ డాక్టర్ చనుమల్లు శ్రీనివాసరావు హాజరై మాట్లాడారు. సిగ్నల్ అండ్ ప్రాసెసింగ్ రంగాలలో ఇసిఇ ఇంజనీరింగ్ విద్యార్థులు నూతన పోకడలకు అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించుకొని అవకాశాలను అందిపుచ్చుకోవాలని, ఎలాంటి కోడింగ్, హార్డ్ వేర్ సంబంధిత నైపుణ్యాలను నేర్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఆదిరెడ్డి రమేష్ మాట్లాడుతూ విద్యార్థులు ఆయా రంగాలలో వస్తున్న నూతన ఆవిష్కరణలు, మార్పులను నేర్చుకొని అభివృద్ధి సాధించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇసిఇ విభాగాధిపతి జి. రామకృష్ణ, అధ్యాపక సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us