UPDATED 26th JUNE 2018 TUESDAY 9:00 PM
రాజానగరం: గైట్ స్కూల్ ఆఫ్ ఫార్మసీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. డి. ధనరాజు ఇరాన్ దేశంలో జరిగిన 18వ ఆసియా క్లినికల్ ఫార్మసీ అంతర్జాతీయ సదస్సుకు హాజరై తిరిగి వచ్చారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ "A Study of efficacy on as a mono or combination theraphy in type -2 diabetic mellities "అనే సిద్ధాంత వ్యాసం సమర్పించానన్నారు. Tenegliphim అనే మందు చక్కర వ్యాధికి ఉపయోగించినప్పుడు కాంబినేషన్ థెరఫీ ద్వారా ఎక్కువ ఉపయోగం ఉంటుందని ఆయన విశ్లేషించారు. ఈ నెల 20 నుంచి 23వ తేదీ వరకు ఇరాన్ దేశంలో జరిగిన ఈ సదస్సుకు వివిధ దేశాల నుంచి ప్రతినిధులు, ప్రొఫెసర్లు, శాస్త్రవేత్తలు హాజరై వారి సిద్ధాంత పత్రాలు సమర్పించారన్నారు. ఈ సదస్సుకు హాజరైన అతి తక్కువ మంది భారతీయుల్లో నేను కూడా ఉండడం తనకెంతో సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా చైతన్య విద్యా సంస్థల చైర్మన్ కె.వి.వి. సత్యనారాయణరాజు( చైతన్య రాజు), గైట్ మేనేజింగ్ డైరెక్టర్ కె. శశికిరణ్ వర్మ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె. లక్ష్మీ శశివర్మ, సిఇవో డాక్టర్ డి.ఎల్.ఎన్. రాజు, జనరల్ మేనేజర్ డాక్టర్ పి. సుబ్బరాజు, తదితరులు ఆయనను అభినందించారు.







