సమస్యలను పరిష్కరించాలని ప్రజావాణిలో ఫిర్యాదు

UPDATED 30th JULY 2018 MONDAY 9:00 PM

సామర్లకోట: స్థానిక 30వ వార్డు గాంధీనగర్ పరిధిలో విద్యుత్ హైవోల్టేజ్ కారణంగా టీవీలు, ఫ్యాన్లు, తదితర ఇతర వస్తువులు కాలిపోతున్నాయని, దీనివల్ల తాము ఆర్థికంగా ఎంతో నష్టపోతున్నామని ఆ వార్డు ప్రజలు డి.వై.ఎఫ్.వై ఆధ్వర్యంలో సోమవారం జరిగిన ప్రజావాణిలో తహసీల్దార్ ఎల్. శివకుమార్ కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యుత్ వైర్లు వేలాడుతున్నాయని, వీధిలైట్లు వెలగడం లేదని, రోడ్లపై నడవాలంటే చాలా భయంగా ఉంటోందన్నారు. అలాగే  డ్రైనేజీలు పూర్తి స్థాయిలో నిర్మించాలని, ఉన్న డ్రైనేజీలను శుభ్రం చేయకపోవడం వల్ల ఆ మురికి నీరు రోడ్లపైకి చేరి బురదగా మారుతున్నాయని తక్షణం తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తుంపాల శ్రీనివాసు, నాగబాబు, మహేష్, శ్రీనివాసు, వీరన్న, సుబ్బారావు, సీతన్న, లక్ష్మీ, పి. నాగబాబు, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us