ఫైజర్ హాస్పిరాకు ఎంపికైన ఆదిత్య విద్యార్థులు

UPDATED 2nd JANUARY 2018 TUESDAY 6:00 PM 

గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య పాలిటెక్నిక్ కళాశాలకు చెందిన విద్యార్థులు  క్యాంపస్ ఇంటర్వ్యూలో విశేష ప్రతిభ కనబరిచి ఉద్యోగాలకు ఎంపికైనట్లు కళాశాల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ప్రముఖ ఫార్మసీ కంపెనీ ఫైజర్ హాస్పిరా నిర్వహించిన క్యాంపస్ ఇంటర్వ్యూలో తమ కళాశాలకు చెందిన 82 మంది విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచి ఉద్యోగాలకు ఎంపికయ్యారన్నారు. ఎంపికైన విద్యార్థులకు నెలకు రూ.13,500 /- వేతనంతో విశాఖపట్టణంలో పనిచేయవలసి ఉంటుందని, ఇంజనీరింగ్ విద్యార్థులతో సమానంగా అనుభవజ్ఞులైన అధ్యాపకులు, ప్లేస్ మెంట్ విభాగం తర్ఫీదు విజయానికి కారణమన్నారు. ఆదిత్య క్యాంపస్ డైరెక్టర్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.టి.వి.ఎస్.కుమార్, వైస్ ప్రిన్సిపాల్ ఎ. మాధవరావు, తదితరులు విద్యార్థులను అభినందించారు. 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us