UPDATED 24th NOVEMBER 2018 SATURDAY 5:30 PM
రాజానగరం: గోదావరి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (గైట్) ప్రాంగణంలో గల అన్ని కళాశాలల్లో స్వచ్ఛభారత్ కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అన్ని విభాగాలకు చెందిన అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు. గైట్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పిఎంఎంఎస్ శర్మ మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం సమాజంలోని ప్రతీ ఒక్కరి భాద్యత అని అన్నారు. స్వచ్ఛ భారత్ ను ముందుగా తమ ఇంటి పరిసరాల్లో చేపట్టి చెత్త, చెదారం లేకుండా శుభ్రం చేయాలన్నారు. ప్రజలను ఈ విషయంలో చైతన్యపరచాలని కోరారు. గైట్ అటానమస్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్ఎస్ఎన్ మూర్తి మాట్లాడుతూ తడి, పొడి చెత్తలను వేరుచేయడం వల్ల దోమలు, ఈగలు వంటి క్రిమికీటకాల ఉధృతి తగ్గుతాయని, తద్వారా అంటువ్యాధులు ప్రబలకుండా అరికట్టవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనరల్ మేనేజర్ డాక్టర్ పి. సుబ్బరాజు, గైట్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ వల్లీమాధవి, గైట్ ఇంజనీరింగ్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ లీలావతి, డాక్టర్ ఎస్. శ్రీగౌరీరెడ్డి, ఎంబీఏ డైరెక్టర్ డాక్టర్ పి.ఆర్.కె. రాజు, ఎన్ఎస్ఎస్ పీవో శివప్రసాద్, స్వచ్ఛభారత్ కోఆర్డినేటర్ షరీఫ్, వివిధ విభాగాల అధిపతులు, తదితరులు పాల్గొన్నారు.







