UPDATED 10th JULY 2018 TUESDAY 9:00 PM
సామర్లకోట: సామర్లకోట ప్రభుత్వ ఆసుపత్రిని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప కృషితో అభివృద్ధి చేస్తున్నట్లు ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ అడబాల కుమారస్వామి అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి డిప్యూటీ సివిల్ సర్జన్ డాక్టర్ పి. చంద్రరావు అధ్యక్షతన మంగళవారం ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ కుమారస్వామి మాట్లాడుతూ ఆసుపత్రి ప్రహరీ గోడ, అదనపు గదులు నిర్మాణం త్వరలోనే పూర్తవుతాయని, అలాగే సిబ్బందిని కూడా నియమించడానికి కృషి జరుగుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ ఎంపిడివో సి.హెచ్. జగ్గారావు, కమిటీ సభ్యులు రెహమాన్, కౌన్సిలర్ బడుగు శ్రీకాంత్, గొంతు సత్యన్నారాయణ, నిమ్మ ఫణికుమార్, తదితరులు పాల్గొన్నారు.







