ఆదిత్యలో ఘనంగా జాతీయ గణిత దినోత్సవం

UPDATED 22nd DECEMBER 2020 TUESDAY 9:00 PM

గండేపల్లి (రెడ్ బీ న్యూస్): గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ క్యాంపస్ లో భారత గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా జాతీయ గణిత దినోత్సవాన్ని గ్రంధాలయ విభాగం ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో ప్రిన్సిపాల్ డాక్టర్ టి.కె. రామకృష్ణారావు, అలాగే ఆదిత్య కాలేజ్ అఫ్ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రిన్సిపాల్ డాక్టర్ ఆదిరెడ్డి రమేష్ ముందుగా రామానుజన్ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 20వ శతాబ్దంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గొప్ప గణిత మేధావులలో శ్రీనివాస రామానుజన్ ఒకరని, గణిత శాస్త్రంలో ఆర్యభట్ట, భాస్కరాచార్యులు తర్వాత మన దేశానికి అంతటి పేరుప్రఖ్యాతలు తెచ్చిన గొప్ప  మేధావి అని అన్నారు. రామానుజన్ ను స్మరించుకుని ఆయన జీవిత చరిత్రను తెలుసుకోవడం మన బాధ్యతని ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో హెచ్&బిఎస్ విభాగాధిపతి ఎం. శ్రీనివాస్, వివిధ విభాగాధిపతులు, అధ్యాపక సిబ్బంది, ఆదిత్య గ్రంధాలయాధికారి కె. అశోక్ కుమార్, వేణు, వెంకట్, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.

 

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us