Bharat Jodo Yatra: ఏపీలోకి ప్రవేశించిన కాంగ్రెస్‌ భారత్ జోడో యాత్ర

UPDATED 14th OCTOBER 2022 SATURDAY 02:50 PM

Bharat Jodo యాత్ర : ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ (Rahul gandhi) చేపట్టిన భారత్ జోడో యాత్ర (Bharath jodo yatra) ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించింది. శుక్రవారం జిల్లాలోని డి.హీరేహాల్ మండలం కనుక్కుప్ప నుంచి రాహుల్‌ (congress) పాదయాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా రాహుల్‌కు శైలజానాథ్‌, రఘువీరారెడ్డి, తులసిరెడ్డి స్వాగతం పలికారు.

జాజురకల్లు, మడేనహళ్లి, లక్ష్మీపురం, డి హీరేహాల్, ఓబులాపురం, ఓబులాపురం చెక్‌పోస్ట్ మీదుగా పాదయాత్ర సాగనుంది. ఏపీలో ఈరోజు 12 కిలోమీటర్ల వరకు రాహుల్ గాంధీ పాదయాత్ర సాగనుంది. మరోవైపు రాహుల్ గాంధీ భారత్ జూడో యాత్ర సందర్బంగా పోలీస్ అధికారులు గట్టి భద్రతను ఏర్పాటు చేశారు.

ఆంధ్రా ప్రాంతంలో 12 కిలోమీటర్లను పూర్తిగా పోలీసు కనుసన్నల్లో ఉండేలా ఆంధ్రా - కర్ణాటక పోలీస్ ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. బళ్లారి - బెంగళూరు హైవేలో రాకపోకలకు ఇబ్బంది లేకుండా పూర్తిస్థాయి చర్యలు చేపట్టారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us