అమ్మ భాషను కాపాడుకోవలసిన భాద్యత అందరిపైనా ఉంది

UPDATED 29th AUGUST 2017 TUESDAY 7:00 PM

ఏలూరు: అమ్మ భాషను కాపాడుకోవలసిన భాద్యత అందరిపైనా ఉందని ఏలూరు హేలాపురి డైమండ్స్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు పెదిరెడ్డి ప్రదీప్ అన్నారు. స్థానిక జింగిల్ బెల్స్ పాఠశాలలో తెలుగు భాషా పితామహుడు గిడుగు వెంకట రామ్మూర్తి  జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొని మాట్లాడారు. అన్ని భాషల కన్నా తెలుగు భాష ఎంతో గొప్పదని, డాడీ మమ్మీ పదాలకు స్వస్తి పలికి అమ్మ భాష అయిన తెలుగు భాషలో అమ్మా నాన్న అని పిలవాలన్నారు. క్లబ్ ప్రధాన కార్యదర్శి కడియాల విజయలక్ష్మి మాట్లాడుతూ బాల్యం నుంచి తెలుగుభాష పై మక్కువ పెంచుకోవాలని, పాశ్చాత్య సంస్కృతి వల్ల నేడు తెలుగు భాష మనుగడ కోల్పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం సెయింట్ థెరిస్సా డిగ్రీ కళాశాల తెలుగు అధ్యాపకురాలు డాక్టర్ నూనె త్రిపురసుందరి, సెయింట్ థెరిస్సా బాలికోన్నత పాఠశాల ఉపాధ్యాయురాలు జి.శ్యామల, మహిళా కళాశాల తెలుగు అధ్యాపకురాలు ఎన్. భవానిలను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో హేలాపురి డైమండ్స్ లయన్స్ క్లబ్ జెడ్ సి వడ్లపూడి కృష్ణ మోహన్, ఫాస్ట్ ప్రెసిడెంట్ శివనాగ పోతురాజు, జింగిల్ బెల్స్ స్కూల్ ప్రిన్సిపాల్ విస్సాప్రగడ సురేష్, నాగబాబు తదితరులు పాల్గొన్నారు.    

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us