UPDATED 27th JUNE 2019 THURSDAY 8:00 PM
పెద్దాపురం: శాంతిభద్రతలు పరిరక్షణకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఎస్ఐ సురేష్ అన్నారు. పెద్దాపురం నూతన ఎస్ఐగా వి. సురేష్ గురువారం భాద్యతలు స్వీకరించారు. ఇంతవరకు ఇక్కడ పనిచేసిన ఎస్ఐ ఎ. కృష్ణ భగవాన్ విఆర్ లోకి వెళ్లగా, పెదపూడిలో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న సురేష్ బదిలీపై ఇక్కడకు వచ్చారు. అనంతరం ఎస్ఐ సురేష్ మాట్లాడుతూ నేరాల నియంత్రణ, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటానని అన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా సిబ్బంది సహకారంతో కృషి చేస్తానని, అధికారులు, ప్రజాప్రతినిధుల సూచనలు, సలహాలతో ప్రజలకు సేవలందించేందుకు ముందుకు సాగుతామని ఆయన పేర్కొన్నారు. అనంతరం ఆయన సిఐ యువకుమార్, డిఎస్పీ చిలకా వెంకట రామారావు లను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.







