ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలి

UPDATED 24th JULY 2019 WEDNESDAY 9:00 PM

సామర్లకోట: సామర్లకోట పట్టణ పరిధిలోని ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలని మున్సిపల్ కమీషనర్ ఎం. ఏసుబాబు అన్నారు. ప్రజలకు త్రాగునీరు అందించే ఉండూరు రోడ్డులో గల  ఫిల్టర్ బెడ్, నాగార్జున సమ్మర్ స్టోరేజ్ ను మున్సిపల్ కమీషనర్ ఏసుబాబు, డిఇ సిహెచ్ రామారావు బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమీషనర్ మాట్లాడుతూ పట్టణ ప్రజలకు పరిశుభ్రమైన త్రాగునీటిని అందించాలని, ఈ ప్రక్రియలో ఎలాంటి  అవాంతరాలు ఎదురైనా అప్రమత్తంగా ఉండి వెంటనే మరమ్మతులు చేపట్టి మంచినీటి సరఫరాకు ఆటంకం లేకుండా చూడాలని అన్నారు. అలాగే ఫిల్టర్ బెడ్ ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచాలని, సరైన నిష్పత్తిలో మంచినీటి ఫిల్టర్ కోసం ఆలం, క్లోరిన్, తదితర పదార్థాలతో సక్రమంగా శుద్ధి చేయాలని సూచించారు. అలాగే ప్రక్కనే గల నాగార్జున సమ్మర్ స్టోరేజ్ ను కూడా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఏఈ రాజశేఖర్, సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us