UPDATED 31st OCTOBER 2018 WEDNESDAY 9:00 PM
సామర్లకోట: స్థానిక అయోధ్యరామపురంలో గల బచ్చు ఫౌండేషన్ మున్సిపల్ ఉన్నత పాఠశాల ఆవరణలో బుధవారం స్వచ్ఛ సర్వేక్షణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమీషనర్ సి.హెచ్. వెంకటేశ్వరావు మాట్లాడుతూ పురపాలక సంఘ పరిధిలో ప్రజలు ఆరోగ్యంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, తడి, పొడి హానికరమైన చెత్తపై పూర్తి స్థాయిలో అవగాహన కలిగి రోగాల బారిన పడకుండా ఉండాలని ప్రజలను కోరారు. స్వచ్ఛభారత్, స్వచ్ఛసర్వేక్షణలో భాగంగా స్వచ్ఛ సామర్లకోటగా తీర్చిదిద్దాలని కమీషనర్ పేర్కొన్నారు. తడి, పొడి, హానికరమైన చెత్త, సూదులు, సిరంజిలు, సీసా పెంకులను విచ్చలవిడిగా రోడ్లపై వేయకుండా పబ్లిక్ హెల్త్ వర్కర్స్ వచ్చినప్పుడు వేరు చేసి వారికి అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం తోటకూర సాయిరామకృష్ణ, శానిటరీ, పాఠశాల సిబ్బంది, చాంద్, ఎన్.జి.వో, డిసిఎస్, పి. చక్రవర్తి, వై. శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.







