సమస్యల పరిష్కారానికి గ్రామదర్శిని దోహదం

UPDATED 11th OCTOBER 2018 THURSDAY 9:00 PM

సామర్లకోట: పట్టణంలో గల అన్ని వార్డుల్లో సమస్యల పరిష్కారానికి గ్రామదర్శిని ఎంతగానో దోహదపడుతుందని మున్సిపల్ కమీషనర్ సి హెచ్. వెంకటేశ్వరావు అన్నారు. గ్రామదర్శిని కార్యక్రమంలో భాగంగా స్థానిక 14వ వార్డులో మున్సిపల్ కమీషనర్ గురువారం పర్యటించి ప్రజల నుంచి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న గ్రామదర్శినిని ప్రజలు సద్వినియోగం చేసుకుని సమస్యలు పరిష్కరించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, మెప్మా సిబ్బంది, వార్డు కౌన్సిలర్, తదితరులు పాల్గొన్నారు. 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us