ఆదిత్యలో మెషిన్ లెర్నింగ్ అండ్ డీప్ లెర్నింగ్ పై వర్క్ షాప్

UPDATED 10th NOVEMBER 2018 SATURDAY 5:30 PM

గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ఎన్ఐటి (వరంగల్) సౌజన్యంతో ఈ నెల 10 నుంచి 15వ తేదీ వరకు ఫ్యాకల్టీ డవలప్ మెంట్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. మెషిన్ లెర్నింగ్ అండ్ డీప్ లెర్నింగ్ అనే అంశంపై ఈ వర్క్ షాప్ నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ఎన్ఐటి (వరంగల్)కు చెందిన కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి డాక్టర్ ఆర్.వి. సుబ్రహ్మణ్యం ముఖ్య అతిధిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న నేటి శాస్త్ర సాంకేతిక రంగాలలో మార్పులను ఎప్పటికప్పుడు తెలుసుకొని ముందుకు సాగాలని, అందుకు ఇటువంటి కార్యశాలలు ఏర్పాటు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని అన్నారు. నేటి విద్యావిధానంలో అధ్యాపకులు నిరంతరం నేర్చుకొంటూ ఉంటేనే విద్యార్థులకు సరైన రీతిలో భోదించే సామర్ధ్యం పెంపొందించుకోగలరని అన్నారు. ఈ సందర్భంగా అధ్యాపక సిబ్బందికి పలు సూచనలు, సలహాలు ఇచ్చి వారి సందేహాలను నివృత్తి చేశారు. ఈ నెల 15వ తేదీ వరకు నిర్వహించు ఈ కార్యక్రమాలలో జెఎన్టీయు(కాకినాడ) నుంచి ప్రొఫెసర్ వి. రవీంద్రనాధ్, ఎన్ఐటి (వరంగల్) నుంచి ప్రొఫెసర్ డి.వి.ఎల్.ఎన్. సోమయాజులు, ఎన్ఐటిఎపి నుంచి నగేష్ భట్టు, బెంగళూర్ నుంచి అశ్విని జిందాల్ పాల్గొని తమ అమూల్యమైన సూచనలు సలహాలతో కార్యక్రమం జరుగుతుందని డాక్టర్ ఎంఎస్ఆర్ తెలిపారు. కోఆర్డినేటరుగా డాక్టర్ ఎస్. రమాశ్రీ వ్యవరిస్తున్నఈ కార్యక్రమానికి సుమారు వివిధ కళాశాలల నుంచి 50మంది అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య విద్యాసంస్థల ప్రిన్సిపాల్స్ డాక్టర్ టి.కె. రామకృష్ణారావు, డాక్టర్ ఆదిరెడ్డి రమేష్, వైస్ ప్రిన్సిపాల్స్ డాక్టర్ వల్లెం శ్రీనివాసరావు, డాక్టర్ ఎస్. రమాశ్రీ, ప్రొఫెసర్ ఎ. రామకృష్ణ, వివిధ విభాగాల అధిపతులు ప్రొఫెసర్ ఎ. వానతి, ప్రొఫెసర్ ఎం. రాజబాబు, సిఎస్ఇ, ఐటి అధ్యాపక సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.  

 

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us