సాగు చేసే ప్రతీ కౌలు రైతుకు పంటసాగు హక్కు పత్రం

*  జాయింట్ కలక్టర్ (ఆర్) డాక్టర్ లక్ష్మీశ

UPDATED 18th JUNE 2020 THURSDAY 6:00 PM

కాకినాడ(రెడ్ బీ న్యూస్): జిల్లాలో సాగు చేసే ప్రతీ కౌలు రైతుకు పంట సాగు హక్కు పత్రం పొందే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలక్టర్ (ఆర్) డాక్టర్ జి. లక్ష్మీశ వ్యవసాయ అధికారులను ఆదేశించారు. స్థానిక నాగమల్లితోటలో ఉన్న జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ (ఆర్) అధ్యక్షతన రైతు భరోసా కేంద్రాల పనితీరు, కౌలు రైతుల కార్డులు, తదితర అంశాలపై డివిజన్ వ్యవసాయ సహాయ సంచాలకులతో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జెసీ లక్ష్మీశ మాట్లాడుతూ జిల్లాలో ప్రతీ గ్రామ సచివాలయం పరిధిలోని 1129 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రతీ రైతు భరోసా కేంద్రంలో ఆయా గ్రామాలకు చెందిన రైతులు అందరూ రిజిస్టర్ అయ్యేలా వ్యవసాయ అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. రైతు భరోసా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన కియోస్క్ యంత్రం పనిచేసే విధానం రైతులకు వివరించాలన్నారు. అలాగే రైతులకు పంట సాగు హక్కు పత్రం యొక్క ముఖ్య ఉద్దేశ్యం, దాని వలన కౌలు రైతులకు కలిగే ప్రయోజనాలపై రైతులకు
విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. రైతు భరోసా, పంటనష్ట కాలంలో ఇన్ పుట్ సబ్సిడీ, ప్రభుత్వం అందించే వివిధ ప్రయోజనాలు కౌలు రైతు భరోసా కార్డు ద్వారా ప్రయోజనం పొందవచ్చని అన్నారు. ప్రతీ గ్రామ సచివాలయంలో గ్రామ వ్యవసాయ సహాయకులు అందుబాటులో ఉన్నారని, వారికి చక్కటి మార్గనిర్దేశం చేస్తే చక్కటి ఫలితాలు వస్తాయని, అలాగే ఈ-క్రాప్ బుకింగ్ సక్రమంగా నిర్వహించాలని ఆయన తెలిపారు. అనంతరం కార్యాలయంలో గల జిల్లా బయోలాజికల్ కంట్రోల్ ల్యాబ్ ను జెసీ  పరిశీలించారు. ఈ సమావేశంలో వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్ కె.ఎస్.వి. ప్రసాద్, ఆత్మ పిడి టి. సునీత, వ్యవసాయశాఖ డిడిలు వి.టి. రామారావు, ఎస్. మాధవరావు, రైతు శిక్షణా కేంద్రం ఉప సంచాలకులు వి. నాగాచారి, జిల్లాలోని డివిజన్ స్థాయి వ్యవసాయ సహాయ సంచాలకులు, తదితరులు పాల్గొన్నారు.

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us