ఆర్ధిక అక్షరాస్యతతో అభివృద్ధి సాధ్యం

UPDATED 20th JANUARY 2020 MONDAY 7:00 PM

పెద్దాపురం(రెడ్ బీ న్యూస్): ఆర్ధిక అక్షరాస్యతతో అభివృద్ధి సాధ్యమని, ఈ దిశగా ముందుకెళ్లాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రంగనాధం శ్రీనివాసరావు రైతులకు సూచించారు. నాబార్డ్, కట్టమూరు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం సంయుక్త ఆధ్వర్యంలో పెద్దాపురం మండలం కట్టమూరు గ్రామంలో స్థానిక గ్రామ సచివాలయంలో సోమవారం నిర్వహించిన ఆర్ధిక అక్షరాస్యత అవగాహనా సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాలా మంది ఎంతో కష్టపడి డబ్బులు సంపాదిస్తున్నప్పటికీ, వాటిని ఏఏ అవసరాలకు ఎలా ఉపయోగించాలి, ఎలా పొదుపు చేయాలనే విషయంలో సరైన అవగాహన లేక నష్టపోతున్నారన్నారు. డబ్బులు సంపాదించడం ఎంత ముఖ్యమో వాటిని సక్రమంగా సరైన పద్దతిలో వినియోగించడం కూడా అంతే ప్రధానమన్నారు. ఎంత పొదుపు చేయాలనే విషయంలో సరైన పద్దతిలో ముందుకెళ్ళినట్లయితే కుటుంబానికి ఆర్ధిక భరోసా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా బీమా పథకాలు, మైక్రో ఏటీఎం, రూపే కిసాన్ కార్డు, డిజిటల్ బ్యాంకింగ్ పై అధికారులు రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్.ఎల్.సి అధికారి కె.వి. రమణ, పిఏసీఎస్ చైర్ పర్సన్ రంగనాధం రమాదేవి, డైరెక్టర్లు పోసిన కృష్ణారావు, దూళ్ల వీరబాబు, బ్రాంచ్ మేనేజర్ ఆర్.వి.ఆర్. కృష్ణంరాజు, పిఏసీఎస్ సిఈవో పి.ఎస్.వి.ఎన్. ఆచార్యులు, గ్రామ సచివాలయ కార్యదర్శి ఎల్. రాధాకృష్ణ, రైతులు మేడిద అబ్బు, మాదిరెడ్డి సత్యనారాయణ, నాగిరెడ్డి వెంకన్న, పడాల చంటి, పిఏసిఎస్ సిబ్బంది, గ్రామ వాలంటీర్లు, తదితరులు పాల్గొన్నారు.                       

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us