UPDATED 31st JULY 2017 MONDAY 2:00 PM
కాకినాడ: ఈ సంవత్సరం నవంబర్ లో కెనడాలో జరిగే ఐ ఎస్ సి ఒలెంపిక్ లో పాల్గొనేందుకు ఆర్ధిక సహాయాన్ని అందించాలంటూ తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం అర్తమూరు కు చెందిన బాడ్మెంటన్ జాతీయ క్రీడాకారిణి శివజ్యోతి రాష్ట్ర ఆర్ధిక శాఖా మంత్రి యనమల రామకృష్ణుడును స్థానిక క్యాంపు కార్యాలయంలో కలుసుకుని విజ్ఞాపన పత్రం అందించింది. విజ్ఞానపనను పరిశీలించిన మంత్రి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రాను శివజ్యోతికి సహాయం అందించాలని ఆదేశించారు. మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరావు, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ నల్లమిల్లి వీర్రెడ్డి, జాతీయ క్రీడాకారిణి శివజ్యోతి కుటుంబ పరిస్థితిని వివరిస్తూ గత ఎనిమిది సంవత్సరాలుగా షటిల్ బాడ్మెంటన్ క్రీడాకారిణిగా రాష్ట్ర, జాతీయ పోటీల్లో పాల్గొని ఎన్నో బహుమతులు గెలుచుకుందని, అయితే ఆమె పేద కుటుంబం కావడంతో కెనడాలో జరిగే ఐ ఎస్ సి ఒలెంపిక్ లో పాల్గొనడానికి రూ.3 లక్షలు సహాయం అందించాలని మంత్రి యనమలకు సూచించారు.







