ఆదిత్య బిజినెస్ స్కూల్ విద్యార్థుల పారిశ్రామిక సందర్శన

UPDATED 22nd JULY 2019 MONDAY 8:30 PM

గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య బిజినెస్ స్కూల్ బిబిఎ, ఐఎంబిఎ విద్యార్థులు పశ్చిమ గోదావరి జిల్లా దుద్దుకూరు గ్రామంలో గల జై శివసంతోషి పాలీ ఫ్యాన్ పరిశ్రమ సందర్శించినట్లు ఆదిత్య విద్యా సంస్థల డైరెక్టర్ డాక్టర్ ఎన్. సుగుణారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు ఈ క్షేత్ర పరిశీలన ద్వారా పొందిన జ్ఞానాన్ని భవిష్యత్తులో వ్యాపార, పారిశ్రామిక రంగాలలో అన్వయించుకొని ఉజ్జ్వలమైన ప్రగతికి బాటలు వేసుకోవాలని అన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి. ఆస్ధాశర్మ మాట్లాడుతూ విద్యార్థులు ప్రత్యక్ష పరిశీలనతో మరింత విశ్లేషణాత్మక జ్ఞానం పొందడానికి ఈ కార్యక్రమం దోహదపడుతుందని, విద్యార్థులు తాము ఎంచుకొన్న మార్గంలో ప్రణాళికాబద్దంగా చదవడం ద్వారా లక్ష్యాలను సులభంగా చేరుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు డి. విజయలక్ష్మి, హరికృష్ణ, విద్యార్థినీ, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us