తెలుగు యువత కార్యదర్శిగా మహమ్మద్ అరిఫ్ ఆలీ

UPDATED 3rd OCTOBER 2017 TUESDAY 5:30 PM

పెద్దాపురం : తూర్పుగోదావరి జిల్లా తెలుగు యువత కార్యదర్శిగా పట్టణానికి చెందిన మహమ్మద్ అరీఫ్ ఆలీ నియమితులయ్యారు. ఈ మేరకు ఆయనకు ఉత్తర్వులు అందాయి. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ తనను ఈ పదవికి ఎంపిక చేసిన హోం మంత్రి చినరాజప్పకు ఆయన కృతజ్ఞతలు తెలియచేశారు. పార్టీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. తెలుగు యువత కార్యదర్శిగా ఎంపికైన ఆలీ గతంలో ఎన్టీఆర్ ట్రస్ట్ కో-ఆర్డినేటర్ గా సేవా కార్యక్రమాలు చేసి చంద్రబాబు నుంచి ఉత్తమ కో-ఆర్డినేటర్ గా అవార్డు పొందారు. ఈ సంధర్భంగా ఆయనను మున్సిపల్ ఛైర్మన్ రాజా సూరిబాబురాజు, ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ఛైర్మన్ బొడ్డు బంగారుబాబు, కౌన్సిలర్ త్సలికి సత్య భాస్కరరావు, గోకిన ప్రభాకరరావు, బిక్కిన సాయి, యాళ్ళ వీరబాబు, నాళం సూరిబాబు, పరదేసి, మార్ని శివ, ఎంఎల్ అలీ బ్రదర్స్ తదితరులు అభినందించారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us