UPDATED 20th MARCH 2018 TUESDAY 9:00 PM
సామర్లకోట: స్థానిక వైఆర్ఎల్ డిగ్రీ కళాశాలలో మంగళవారం ఉదయం నిర్వహించిన క్యాంపస్ ఇంటర్వ్యూలలో 13 మంది అభ్యర్థులు ఎంపికనట్లు కళాశాల మేనేజింగ్ డైరెక్టర్ వై .రవిచంద్ తెలిపారు. ప్రముఖ కంపెనీ హెట్రో డ్రగ్స్ నిర్వహించిన ఈ ఎంపికలలో 40 మంది విద్యార్థినీ, విద్యార్థులు రాత పరీక్షకు హాజరు కాగా, వారిలో 13 మంది తమ కళాశాల విద్యార్థులు ఎంపికైనట్లు తెలిపారు. ఎంపికైన విద్యార్థులకు ఏడాదికి లక్షా యాభైవేలు జీతంతో పాటు వివిధ సౌకర్యాలు కల్పిస్తారని, వీరు మే నెల మొదటి వారంలో విధులకు హాజరు కావలసి ఉంటుందని అన్నారు.







