* పెద్దాపురం డిఎస్పీ వెంకట రామారావు
* గండేపల్లి పోలీస్ స్టేషన్లో ఆకస్మిక తనిఖీలు
గండేపల్లి: గండేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో హైవే విస్తీర్ణం ఎక్కువగా ఉందని, రోడ్డు ప్రమాదాలు నివారణకు పటిష్ఠమైన చర్యలు చేపట్టాలని పెద్దాపురం డిఎస్పీ చిలకా వెంకట రామారావు సిబ్బందిని ఆదేశించారు. మండల కేంద్రమైన గండేపల్లి పోలీస్ స్టేషనును డిఎస్పీ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గండేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాలు నివారణకు పటిష్ఠమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. రోడ్లు మరమ్మతులు జరుగుతున్న దృష్ట్యా ప్రమాద నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సిఐ కాశీ విశ్వనాథ్, ఎస్ఐ దుర్గా శ్రీనివాస్, ఏఎస్ఐ రాజు, సిబ్బంది పాల్గొన్నారు.







