కాకినాడ(రెడ్ బీ న్యూస్) :
జిల్లాలో ప్రారంభమైన రబీ సీజనుకు సంబంధించి రైస్ మిల్లర్లు ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డా.జి.లక్ష్మీశ రైస్ మిల్లర్ల ప్రతినిధులను ఆదేశించారు.
శనివారం కలెక్టర్ కార్యలయంలో జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన 2019-20
సంవత్సరం రబీ సీజనుకు సంబంధించి ధాన్యం సేకరణ, ధాన్యం కొనుగోలు కేంద్రాలు తదితర అంశాలపై
రైస్ మిల్లర్ల ప్రతినిధులతో శనివారం ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసి మాట్లాడుతూ జిల్లాలో
రబీ సీజనుకుగాను 8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా ప్రభుత్వం నిర్దేశించిందన్నారు.
లక్ష్యానికి అనుగుణంగా జిల్లాలో ఉన్న రైస్ మిల్లర్ల ప్రతినిధులు అధికారులకు సహకరించి సకాలంలో
లక్ష్యాన్ని పూర్తి చేయాలన్నారు. సివిల్ సప్లై కార్పోరేషన్, రైస్ మిల్లర్లకు మధ్య జరిగే ఎంఓయు,బ్యాంక్ గ్యారంటీలు వెంటనే పూర్తి చేయాలన్నారు. సిఎమ్ఆర్, సార్టేక్స్ రైస్ పెండింగులో ఉన్నవి వెంటనే
పూర్తి చేయాలన్నారు.
అనంతరం జేసి తన ఛాంబరులో పాత్రికేయలుతో మాట్లాడుతూ జిల్లాలో ప్రస్తుత రబీ సీజనుకుగాను 1.65 లక్షల హెక్టార్లు వరి సాగు నుంచి సుమారుగా 13 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేయడం జరిగిందన్నారు.జిల్లాలో లాక్ డౌన్ నేపథ్యంలో రైతులకు ఇబ్బంది కలిగించ
కుండా ధాన్యం సేకరించాలన్నారు. రైతు పండించిన ధాన్యానికి తప్పని సరిగా ప్రభుత్వం నిర్దేశించిన కనీస మద్దతు ధర ప్రతీ రైతుకు చెల్లించాలన్నారు. ఎ గ్రేడుకు చెందిన క్వీంటాలు ధాన్యానికి రూ.1835, సాధారణ
రకం క్వీంటాలు ధాన్యానికి రూ. 1815 తప్పని సరిగా చెల్లించాలన్నారు. ప్రస్తుత కరోనా వైరస్ నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా
చూపించి రైతులను భయపెట్టి తక్కువ ధరకు ధాన్యన్ని కొనుగోలు చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని జేసి హెచ్చరించారు. జిల్లాలో ఎక్కడైన ధాన్యం కొనుగోలులో అక్రమాలకు పాల్పడినట్లు తెలిస్తే తన దృష్టికితీసురావలన్నారు. రైతులు వారి సమస్యలను ప్రభుత్వం ఏర్పాటు చేసిన 1902 టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్ చేసి తెలియచేయవచ్చాన్నారు. ధాన్యం కళ్ళాల వద్దకే అధికారులు వెళ్ళి ధాన్యన్ని కొలుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధరపై రైతులకు అవగాహన, చైతన్యం కలిగించే విధంగా ఆటోల ద్వారా ప్రచారం చేయడం జరుగుతుందన్నారు. గ్రామ వ్యవసాయ సహయకులు, ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రతినిధులు విస్తృతంగా రైతులకు అవగాహన కల్పించాలన్నారు.
జిల్లాలో ప్రస్తుతం 271 ధాన్యం కొనుగోలు కేంద్రాలు పనిచేస్తున్నాయని రెండు రోజుల్లో మరో 100 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడానికి చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. ధాన్యం
అమ్మిన రైతులకు 48 గంటలలోపు వారి బ్యాంక్ ఖాతాల్లో సోమ్ము జమ కాబడుతుందన్నారు.
జిల్లాలో పంట కోతకు సంబందించి మిషన్ల కొరత లేదని జేసి తెలిపారు .
ఈ సమావేశంలో డిఎమ్ సివిల్ సప్లై ఈఎన్ జయరావు, డిఎఓ పి.ప్రసాద్ బాబు,డిసిఓ పాండు రంగారావు, రాష్ట్ర, జిల్లా రైస్ మిల్లర్ల అసోషియేషన్ ప్రెసిడెంట్ డి.భాస్కర్ రెడ్డి, రైస్
మిల్లర్ల ప్రతినిధులు పాల్గొన్నారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్‌పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







