ముఖ్యమంత్రి సభలో టూ ఇన్ వాహనం ప్రదర్శన

UPDATED 23rd APRIL 2018 TUESDAY 10:00 PM

సామర్లకోట: గత నెలలో ప్రభుత్వం ఇచ్చిన డ్రైనేజీలు శుభ్రం చేసే టూ ఇన్ వన్ వాహనాన్ని మండపేట మండలం ద్వారపూడిలో మంగళవారం జరిగిన ముఖ్యమంత్రి సభలో ప్రదర్శించి ఆ యంత్ర ఉపయోగాలను వివరించడం జరిగినట్లు స్థానిక విస్తరణ శిక్షణ కేంద్రం ఫ్యాకల్టీ ఆర్. గోపాలరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  విస్తరణ శిక్షణా కేంద్రం ఆధ్వర్యంలో ప్రదర్శించిన ఈ యంత్రం పనితీరు, ఉపయోగాలు గురించి వివరించడం జరిగిందని, డ్రైనేజీలలో పూడిక తీసి కావలసిన చోటకు వేగంగా రవాణా చేయడానికి, కాలువలు శుభ్రం చేయడానికి, కూలీలు  ముందుకు రాని సందర్భాలలో ఈ యంత్రాన్ని ఉపయోగించి తక్కువ ఖర్చుతో పూడిక తీయవచ్చని తెలిపారు. పది మంది కార్మికులు చేసే పనిని ఈ యంత్ర సహాయముతో ఇద్దరితో పూర్తి చేయవచ్చని, ఒక అడుగు వెడల్పు గల మురికి కాలువలు నుంచి ఎక్కువ వెడల్పు, లోతు కలిగిన కాలువలలో కూడా పూడికను అతి సులభంగా ఈ యంత్ర సహాయంతో తీయవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫ్యాకల్టీలు రామ్మోహనరావు, కుమార్ రాజా, ఎస్.కె. మొహిద్దీన్, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us