UPDATED 13th OCTOBER 2018 SATURDAY 6:00 PM
గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్థులు జెఎన్టీయుకె బాస్కెట్ బాల్ టీమ్ కు ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆదిరెడ్డి రమేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 22 నుంచి 26 వరకు చెన్నై నగరంలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో జరగనున్న సౌత్ జోన్ బాస్కెట్ బాల్ పోటీలలో పాల్గొనే జెఎన్టీయుకె జట్టుకు తృతీయ సంవత్సరం మెకానికల్ ఇంజనీరింగ్ చదువుచున్న ఎన్. అజయ్ శివకుమార్, తృతీయ సంవత్సరం ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చదువుచున్న ఎమ్. బాలదుర్గావెంకట్రావులు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు తెలిపారు. గుంటూరులో ఈ నెల మూడవ తేదీన జరిగిన టీమ్ సెలక్షన్ లో తమ కళాశాల విద్యార్థులు ఇద్దరు ఉండడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల అధిపతులు కళాశాల ఫిజికల్ డైరెక్టర్స్ ఎన్. శంకర్, ఎమ్. రాజు పాల్గొన్నారు.







