* రాష్ట్రంలో నాక్ ఏ+ గ్రేడ్ కలిగిన ఏకైక విద్యా సంస్థ గైట్
* చైతన్య విద్యా సంస్థల చైర్మన్ కె.వి.వి. సత్యనారాయణరాజు
UPDATED 1st OCTOBER 2018 MONDAY 7:00 PM
రాజానగరం: గోదావరి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (గైట్) అటానమస్ కళాశాలకు నాక్ ఏ+ గ్రేడ్ తో రెండవ సైకిల్ అక్రిడేషన్ లభించినట్లు చైతన్య విద్యాసంస్థల చైర్మన్ కె.వి.వి. సత్యనారాయణరాజు ( చైతన్య రాజు), గైట్ మేనేజింగ్ డైరెక్టర్ కె. శశికిరణ్ వర్మ సోమవారం తెలిపారు. గత నెలలో నాక్ బృందం గైట్ కళాశాలను సందర్శించిందని చెప్పారు. కళాశాలలో విదార్థులకు అవసరమైన అధునాతన సదుపాయాలతో విద్యను అందించడం, విద్యార్థులకు కల్పిస్తున్న మౌలిక వసతులు సదుపాయాలు వంటి వాటిని పరిశీలించడంతో పాటు విద్యార్థులు, తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులతో ప్రత్యక్షంగా సమావేశం నిర్వహించి అభిప్రాయాలు సేకరించారని తెలిపారు. దీనిపై నాక్ బృందం తమ నివేదికను బెంగళూరులో గల నాక్ కు సమర్పించిందని అన్నారు. అన్నిటినీ పరిశీలించిన నాక్ అధికారులు బృందం తమ సంస్థకు నాక్ ఏ+ గ్రేడ్ తో అక్రిడేషన్ ఇచ్చిందన్నారు. నాలుగు పాయింట్లు సిజిపిఏకు, గైట్ కళాశాలకు 3.37 పాయింట్లు లభించాయని, గతంలో నాక్ మొదటి సైకిల్ అక్రిడేషన్ లో గైట్ అటానమస్ కళాశాలకు 3.31 సిజిపిఏ లభించగా దానిని అధిగమించి రెండవ సైకిల్ లో 3.37 సిజిపిఏ సాధించడం సంతోషంగా ఉందన్నారు. ఈ సమావేశంలో గైట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె. లక్ష్మీ శశివర్మ, చైతన్య సంస్థల సిఈవో డాక్టర్ డి.ఎల్.ఎన్. రాజు, గైట్ జనరల్ మేనేజర్ డాక్టర్ పి. సుబ్బరాజు, ప్రిన్సిపాల్ డాక్టర్ టి.వి. ప్రసాద్, డీన్ డాక్టర్ టి. జయానందకుమార్, తదితరులు పాల్గొన్నారు.







