ఉన్నత భారత్ అభియాన్ సర్వే

UPDATED 29th DECEMBER SATURDAY 5:30 PM

జగ్గంపేట: ఉన్నత భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం వాలంటీర్లు జగ్గంపేట మండలం కాట్రావులపల్లి గ్రామంలో శనివారం ఇంటింటి సర్వే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు గ్రామంలో  ఇంటింటికి వెళ్లి వారి స్థితిగతులు, సౌకర్యాలు, సమస్యలపై సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆదిరెడ్డి రమేష్ మాట్లాడుతూ ఉన్నత భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా తమ కళాశాల ఐదు గ్రామాలను దత్తత తీసుకుందని, మిగిలిన గ్రామాల్లో కూడా త్వరలోనే సర్వే నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు జె. బాలమోహన్ రాజు, ఎమ్. సోమిరెడ్డి, బి. కాలేష్, బీ. శ్రీకాంత్, విద్యార్థులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us