UPDATED 3rd SEPTEMBER 2018 MONDAY 9:00 PM
సామర్లకోట: రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, అలాగే పాఠశాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. స్థానిక అయోధ్యరామపురంలో గల మున్సిపల్ ఉన్నత పాఠశాలలో సర్వశిక్షా అభియాన్ నిధులతో నిర్మించిన అదనపు తరగతి గదులను సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి చినరాజప్ప మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు కార్పోరేట్ పాఠశాలలకు ధీటుగా మెరుగైన విద్యా ప్రమాణాలతో విద్యను అందించే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. పాఠశాల విద్యా ప్రగతిని అడిగి తెలుసుకొని, నూరు శాతం ఉత్తీర్ణత సాధించడం పట్ల పాఠశాల హెచ్ఎం తోటకూర సాయిరామకృష్ణను అభినందించి జ్ఞాపికను అందచేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కౌన్సిలర్ మన్యం చంద్రరావు, బడుగు శ్రీకాంత్, నాగం రవి, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ అడబాల కుమారస్వామి, మున్సిపల్ కమిషనర్ సి.హెచ్ వెంకటేశ్వరరావు, గుమ్మళ్ల రామకృష్ణ, శ్రీనివాసరాజు, శ్యాంసుందర్, యు. సత్యనారాయణ, తాళ్లూరి వైకుంఠం, ఎ.ఎల్.వి కుమారి, గోవిందు, అరుణ, కె.వి.వి. సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.







