UPDATED 16th JULY 2019 TUESDAY 8:00 PM
సామర్లకోట: చంద్రగ్రహణం సందర్భంగా మంగళవారం సాయంత్రం నుంచి సామర్లకోట పట్టణ, మండల పరిధిలోని అన్ని ఆలయాలను మూసివేశారు. సంప్రోక్షణ అనంతరం బుధవారం ఉదయం తెరుస్తారు. ఆలయాల్లో మంగళవారం సాయంత్రం జరిగే పూజలను, నివేదనలు, దర్శనాలను నిలిపివేశారు. పవిత్ర పంచారామ క్షేత్రాల్లో ఒకటైన శ్రీ కుమారారామ భీమేశ్వరస్వామి ఆలయాన్ని చంద్రగ్రహణం సందర్భంగా మంగళవారం సాయంత్రం అర్చకులు, ఆలయ సిబ్బంది మూసివేశారు. బుధవారం ఉదయం ఆలయంలో సంప్రోక్షణ అనంతరం భక్తులకు దర్శనానికి అనుమతించనున్నట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి పులి నారాయణమూర్తి తెలిపారు.







