UPDATED 8th OCTOBER 2017 SUNDAY 2:00 PM
పెద్దాపురం: ప్రముఖ బంగారు నగల వ్యాపార సంస్థ వైభవ్ జెవెల్లరీస్ ప్రతినిధులపై పెద్దాపురం మండల జెడ్పిటీసి సుందరపల్లి శివ నాగరాజు ఆదివారం ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దాపురం మండలం కట్టమూరు గ్రామజంక్షన్ లో వైభవ్ జెవెల్లరీస్ సంస్థ అనధికారికంగా ఏర్పాటు చేసిన ప్రకటన బోర్డును తక్షణమే తొలగించాలని వైభవ్ ప్రతినిధులను ఆదేశించారు. మండల పరిధిలోని గ్రామాల్లో అనధికారికంగా గ్రామ పంచాయతీల నుంచి ఎటువంటి అధికారిక అనుమతులు తీసుకోకుండా ఇష్టానుసారం ప్రధాన కూడళ్లలో, రోడ్డుకి ఇరువైపులా ప్రకటన బోర్డులు ఏర్పాటు చేస్తూ గ్రామ పంచాయతీల ఆదాయానికి గండికొడితే సహించేదిలేదని ఆయన హెచ్చరించారు. ఇష్టానుసారం ఏర్పాటు చేస్తున్న ప్రకటన బోర్డులు కారణంగా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని ఆయన పేర్కొన్నారు.







