UPDATED 23rd JULY 2019 TUESDAY 5:00 PM
గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల మెకానికల్ విభాగం ఆధ్వర్యంలో "అప్లికేషన్స్ ఆఫ్ ఫైనిట్ ఎలిమెంట్ అనాలసిస్ అండ్ కంప్యూటర్ ఎయిడెడ్ ఇంజనీరింగ్ ఇన్ ఇండస్ట్రీ" అనే అంశంపై మంగళవారం కార్యశాల విజయవంతంగా నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి యూకెన్ టెక్నాలజీస్ డైరెక్టర్ జి.ఎన్. రాజమహేంద్ర ముఖ్య అతిధిగా హాజరై మెకానికల్ ఇంజనీరింగులో ఫైనిట్ ఎలిమెంట్ అనాలసిస్ ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ బి.హెచ్. వరప్రసాద్ మాట్లాడుతూ మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థులను నైపుణ్యత, సృజనాత్మకత ఉద్యోగాలకు సన్నద్ధమయ్యేలా తీర్చిదిద్ధేందుకు ఇటువంటి కార్యశాలలు తరచుగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వల్లెం శ్రీనివాసరావు, డాక్టర్ కామేష్, కార్యక్రమ కోఆర్డినేటర్, అసోసియేట్ ప్రొఫెసర్ ఎ. శిరీష, అధ్యాపక సిబ్బంది, విద్యార్థినీ, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.







